ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మరియు ఎమ్మెల్యేల కోసం నిర్వహిస్తున్న ‘ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్’ పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు.
బుధవారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రఘురామరాజు, పరుగు తీసే క్రమంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి పిచ్‌పై పడిపోయారు. ఈ క్రమంలో ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో మైదానంలోని వారు వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనతో ఆటలో కొంతసేపు ఆందోళన నెలకొంది. సహచర ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనను పరామర్శించి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
