నెల్లూరు నగర పాలక సంస్థ నూతన మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఆమె పేరును 40వ డివిజన్ కార్పొరేటర్, ప్రస్తుత మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ప్రతిపాదించారు.
మేయర్ పదవికి సుజాత పేరును ప్రతిపాదించగా, ఇతర పోటీదారులు ఎవరూ లేకపోవడంతో కార్పొరేటర్లందరూ ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు నూతన మేయర్‌గా దేవరకొండ సుజాత ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించి, నియామక ధృవీకరణ పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నూతన మేయర్‌కు పలువురు కార్పొరేటర్లు, అధికారులు మరియు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని సుజాత ఈ సందర్భంగా పేర్కొన్నారు.
