యువత కోసం, యువత ఆధ్వర్యంలో స్థాపితమైన బీ ఎన్ ఎస్ ఛానెల్ ను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. ఛానెల్ డైరక్టర్లు మేఘనా రెడ్డి, సమయా రెడ్డి తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. బీ ఎన్ ఎస్ ఛానెల్ లక్ష్యాలు, ఆశయాలను వారు ఆయనకు వివరించారు. వినూత్నంగా సమాజంలోకి తీసుకొని వస్తున్న బీఎన్ఎస్ ఛానెల్ ప్రత్యేకతలను తెలియచేశారు.
విదేశాలలో విద్యాభ్యాసం చేసి వచ్చిన మేఘనా, సమయాల పట్టుదల, అభిలాష లను డీజీపీ శివధర్ రెడ్డి మెచ్చుకొన్నారు. ఈ సందర్భంగా టీమ్ కు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు.
