Dilsukhnagarలో తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ముందస్తు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును కట్టుదిట్టం చేశారు.
మిలియన్ మార్చ్‌కు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా చర్యలను పోలీసులు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
