₹5 బిస్కెట్ కోసం భక్తులతో బంధం 130 కి.మీ నడిచిన శునకం vid

March 28, 2026 12:35 PM

Adilabad జిల్లా గుడిహత్నూరు నుంచి Kondagattu Anjaneya Swamy Temple వరకు హనుమాన్ దీక్షాపరులతో కలిసి ఒక శునకం సుమారు 130 కిలోమీటర్లు నడిచిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కేవలం ₹5 విలువైన బిస్కెట్ ప్యాకెట్ కోసం మొదలైన ఈ ప్రయాణం, ఐదు రోజుల పాటు భక్తులతో పాటు కొనసాగింది. భక్తుల వెంట నడుస్తూ ఆ శునకం వారికి స్నేహితుడిగా మారింది.దీర్ఘ నడక కారణంగా కాళ్లకు నొప్పులు రావడంతో, భక్తులు ఆ శునకానికి సాక్సులు తొడిగించి ప్రత్యేకంగా చూసుకున్నారు. దానికి ఆహారం, విశ్రాంతి కల్పిస్తూ ఎంతో ప్రేమగా సపర్యలు చేశారు.ఈ సంఘటన భక్తి, మానవత్వం, జంతు ప్రేమకు ప్రతీకగా నిలుస్తోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media