దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి CM చంద్రబాబు నివాళులు

March 23, 2026 1:08 PM

శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన సామాజిక సేవలను గుర్తుచేశారు.


శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. సామాజిక విప్లవ నాయకుడిగా ఆయన చేసిన సేవలను CM గుర్తుచేశారు.శెట్టిబలిజ సంక్షేమ సంఘం స్థాపన ద్వారా బలహీన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించిన మహనీయుడిగా దొమ్మేటి వెంకటరెడ్డి నిలిచారని తెలిపారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆయన సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు.దేశ స్వాతంత్య్రానికి ముందే సామాజిక సేవలో ముందుండి, విద్య ద్వారా సాధికారత సాధ్యమని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని సీఎం అన్నారు. ఆయన ఆలోచనలు, సేవలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media