బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘Don 3’ చుట్టూ నడుస్తున్న వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హీరో Ranveer Singh, దర్శకుడు Farhan Akhtar మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్‌లోకి ఇప్పుడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ Kangana Ranaut ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ వివాదం కాస్తా ఇప్పుడు Kangana Vs Cine Federation (FWICE) గా మారిపోయింది.
ఇటీవల జరిగిన ‘Bharat Bhagya Vidhata’ సినిమా ట్రైలర్ లాంచ్‌లో కంగనా ఈ ఇష్యూపై ఓపెన్‌గా రియాక్ట్ అయింది. “ఇండస్ట్రీలో మన సక్సెస్, స్థాయి పెరిగేకొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు. గతంలో నన్నూ ఇలాగే అందరూ బ్యాన్ చేశారు. అయినా నేనేం భయపడలేదు, ఇప్పుడు నా కెరీర్ బానే ఉంది. రణ్‌వీర్‌కు కూడా అంతా మంచే జరుగుతుంది” అంటూ రణ్వీర్ సింగ్‌ను వెనకేసుకొచ్చింది.
అయితే కంగనా చేసిన ఈ కామెంట్స్‌పై ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ Ashok Pandit తీవ్రంగా స్పందించారు. అసలు గొడవ ఏంటో, ఫ్యాక్ట్స్ ఏంటో తెలియకుండా కంగనా నాన్సెన్స్ మాట్లాడుతోందంటూ ఆయన ఫైర్ అయ్యారు. “నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతావు కాబట్టే నిన్ను ఇండస్ట్రీ దూరం పెట్టింది” అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, తాము రణ్వీర్ను బ్యాన్ చేయలేదని.. ఒక హీరో సినిమా నుండి తప్పుకోవడం వల్ల నష్టపోయిన నిర్మాతలు, రోజువారీ కార్మికుల హక్కుల కోసమే తాము ప్రశ్నిస్తున్నామని ఫెడరేషన్ స్పష్టం చేసింది. మొత్తానికి ఇండస్ట్రీ వర్గాల మధ్య రేగిన ఈ బాలీవుడ్ కాంట్రవర్సీ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.
Also Read



