AP:రాపూరులో ‘క్రాష్ ప్రోగ్రామ్’ వేసవిలో త్రాగునీటి లక్ష్యం

February 6, 2026 11:20 AM

ప్రతి ఏటా వేసవిలో ఎదురయ్యే త్రాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాపూరు ఎం.పి.డి.ఓ కార్యాలయంలో ఆర్.డబ్ల్యు.ఎస్ (RWS) అధికారుల ఆధ్వర్యంలో ‘క్రాష్ ప్రోగ్రామ్’ను గురువారం ప్రారంభించారు.

రాపూరు మండలంలోని అన్ని చేతి పంపులు (Hand Pumps), రక్షిత త్రాగునీటి పథకాల ప్రస్తుత పరిస్థితిని అధికారులు అంచనా వేస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నట్లయితే, వెంటనే మెకానిక్ బృందాలు అక్కడికి చేరుకుని మరమ్మతులు పూర్తి చేస్తాయి. మండలంలోని నీటి వనరుల స్థితిగతులపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించి, ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్.డబ్ల్యు.ఎస్ డి.ఈ. నాగరాజు మరియు ఎం.పి.డి.ఓ భవాని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఈ ఆంజనేయులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media