హైదరాబాద్‌లోని Durgam Cheruvu Cable Bridge పై ఏప్రిల్ 19 ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

శ్యామ్ రాజ్ తన భార్యకు ఫొటోలు తీసేందుకు రోడ్డుపై నిలబడగా, Jubilee Hills వైపు నుండి IKEA Hyderabad దిశగా వేగంగా దూసుకొచ్చిన వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ లగ్జరీ కారు అతన్ని బలంగా ఢీకొట్టింది.తీవ్రంగా గాయపడిన శ్యామ్ రాజ్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహనం ఒక కంపెనీ పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించి, నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
