మంగళగిరిలో నిర్వహించిన ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారి, ఏపీ ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈవో ఆవుల చంద్రశేఖర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ “హనుమాన్ ఫౌండేషన్” ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా తీసుకున్నట్లు తెలిపారు. ఔషధ మరియు సుగంధ మొక్కల పరిరక్షణ, ఆరోగ్యం మరియు జీవనోపాధి అభివృద్ధికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
