పాత వాహనాలపై ప్రభావానికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో దొరుకుతున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) ఇంధనంపై ఒక రేంజ్‌లో రచ్చ నడుస్తోంది. పాత బండ్ల ఇంజన్లు ఖాళీ అయిపోతాయా? మైలేజ్ పడిపోతుందా? అని జనం తెగ టెన్షన్ పడిపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక క్రేజీ అండ్ షాకింగ్ అప్‌డేట్ ఇచ్చింది. అసలు E20 ఇంధన విధానం ప్రస్తుతం ఇంకా ప్రయోగ దశలోనే ఉందని, ఇది వంద శాతం సేఫా కాదా అని తేలడానికి ఇంకా టైమ్ పడుతుందని కేంద్రం క్లియర్ కట్ గా ఒప్పుకుంది.
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్‌ను సవాల్ చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరగ్గా.. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి హాజరై కీలక విషయాలు బయటపెట్టారు. E20 అనేది ప్రభుత్వ పాలసీలో భాగమే అయినప్పటికీ.. దీని ఇంపాక్ట్ ఎలా ఉందనే దానిపై నిరంతరం నిఘా పెట్టామని కోర్టుకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి దీని ఎఫెక్ట్‌పై ఒక అల్టిమేట్ అంచనాకు వస్తామని చెప్పారు.
రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ లలో E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజన్లు తుప్పుపట్టిపోతున్నాయని, మైలేజ్ దారుణంగా తగ్గిపోతోందని విపరీతమైన మీమ్స్, రీల్స్ ట్రెండ్ అయ్యాయి. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ఆ ఆందోళనలన్నింటికీ ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవని తేల్చేసింది. E20 వల్ల బండ్లు పాడైపోతున్నాయనడానికి ఇప్పటివరకు ఎలాంటి పక్కా ఆధారాలు దొరకలేదని జనాన్ని కూల్ చేసే ప్రయత్నం చేసింది.
ప్రభుత్వం ఈ ఇథనాల్ బ్లెండింగ్ వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ బిజినెస్ యాంగిల్ ఉంది. ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల భారత్‌కు ఇప్పటివరకు ఏకంగా రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. ఇథనాల్‌ను చెరకు, ధాన్యం నుంచి తయారు చేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం. కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.
నిజానికి పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపాలనే టార్గెట్‌ను కేంద్రం 2030 నాటికి ఫిక్స్ చేసుకుంది. కానీ, గడువు కంటే ముందే పనులు పూర్తి చేసి, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచే దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సప్లై స్టార్ట్ చేసేసింది. ఇంతటితో ఆగకుండా 2030 నాటికి ఈ మిశ్రమాన్ని ఏకంగా 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఏదేమైనా, ఒకవైపు బంకుల్లో E20 పెట్రోల్ కొడుతూనే.. మరోవైపు ఇది ఎంతవరకు సేఫ్ అని తేలడానికి ఇంకా టైమ్ పడుతుందని కేంద్రం కోర్టులో చెప్పడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. లెట్స్ సీ.. వచ్చే ఏడాది కేంద్రం ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో…



