నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF) భారత పరిశోధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఇది సైన్స్ & ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (SERB) స్థానంలో వచ్చింది.
NRF లక్ష్యాలు (Goals):
భారతదేశ అభివృద్ధి సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్-విభాగ పరిశోధనను (Interdisciplinary Research) ప్రోత్సహించడం.
పరిశోధనను విధానాలు మరియు ఆచరణలోకి అనువదించడం.
పరిశోధన పునరావృత్తిని తగ్గించడం.
ప్రధానమంత్రి NRF కు ఎక్స్-అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు.
బోర్డు: విద్య, సైన్స్ & టెక్నాలజీ కేంద్ర మంత్రులు వైస్ ప్రెసిడెంట్లుగా ఉంటారు. ఇందులో ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సహా 18 మంది సభ్యులు ఉంటారు.
అంచనాలు(prediction on future)
R&D పెట్టుబడి పెంపు 2030 నాటికి R&D లో పెట్టుబడిని GDP లో 0.7% నుంచి 2% కి పెంచడం.
పరిశోధన పెంపు ప్రపంచ శాస్త్రీయ ప్రచురణలలో భారతదేశ వాటాను 5% నుంచి 7% కి పెంచడం.
బడ్జెట్ కేటాయింపులు:

మొత్తం కేటాయింపు (2021-22 ) ఐదేళ్లలో రూ.50,000 కోట్లు కేటాయించాలని ప్రకటించారు. ఇందులో 28% (రూ.14,000 కోట్లు) ప్రభుత్వం నుంచి, 72% (రూ.36,000 కోట్లు) ప్రైవేట్ రంగం నుంచి సమకూర్చాల్సి ఉంది.
2025-26 బడ్జెట్: NRF కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు. (గతంలో 2024-25 బడ్జెట్లో దీని గురించి ప్రస్తావన లేదు.)
