బాన్సువాడలో ఉద్రిక్తత.. BJP నేత ఎండల లక్ష్మీనారాయణ అరెస్ట్

February 21, 2026 4:50 PM

బాన్సువాడలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత ఎండల లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు వద్ద ఆయనను అడ్డుకున్న పోలీసులు, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు.

బాన్సువాడలో దేవుడి పాటలు పెట్టినందుకు ఒక హిందూ యువతిపై జరిగిన దాడి, అలాగే గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు ఎండల లక్ష్మీనారాయణ బయలుదేరారు. అరెస్ట్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయాయని, పోలీసులు బాధితులకు కాకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారని విమర్శించారు. హిందూ యువతిపై దాడికి పాల్పడి, అత్యాచార యత్నం చేసిన నిందితుడిపై నిర్భయ కేసు మరియు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే నియోజకవర్గవ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ప్రస్తుతం ఎండల లక్ష్మీనారాయణ అరెస్ట్‌తో బాన్సువాడ మరియు భిక్కనూరు పరిసరాల్లో భారీగా పోలీసులు మొహరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media