INTERNATIONAL :Ethiopia అగ్నిపర్వతం విస్ఫోటనం – బూడిద మేఘాలు(VOLCANIC ASH) భారతదేశానికి

November 25, 2025 3:46 PM

ఎథియోపియా ఉత్తరంలోని ఆఫార్ ప్రాంతంలో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం దాదాపు 12,000 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆదివారం విస్ఫోటనం చెందింది. భారీగా ఎగసిన బూడిద మేఘాలను 100–120 కి.మీ వేగంతో వీచిన గాలులు రెడ్ సీ, అరేబియా సముద్రం మీదుగా తీసుకువచ్చి సోమవారం రాత్రి గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ ప్రాంతాలను చేరాయి.

ఇప్పటికే తీవ్రమైన కాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీపై ఈ బూడిద ప్రభావం చూపడంతో విమానయాన కార్యకలాపాలు కూడా దెబ్బతిన్నాయి.

భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం ఈ బూడిద మేఘాలు ఇప్పుడు చైనా వైపు కదులుతున్నాయి మరియు ఇవి ఈ రోజు సాయంత్రం 7:30కు భారత ఆకాశాన్ని పూర్తిగా వీడతాయి.

ఈ మేఘాల్లో ప్రధానంగా సల్ఫర్ డైఆక్సైడ్ ఉండగా, అగ్నిపర్వత బూడిద స్థాయిలు తక్కువ నుండి మధ్యస్థంగా ఉన్నాయని పేర్కొంది.

డిజీసీఏ (DGCA) అన్ని విమానయాన సంస్థలకు బూడిద ప్రభావిత ప్రాంతాలను పూర్తిగా నివారించాలని, ఏవైనా అనుమానాస్పద బూడిద ఘటనలు గమనిస్తే వెంటనే నివేదించాలని సూచించింది.

ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్,ఎయిర్ ఇండియా 11 విమానాలను రద్దు చేసింది.

న్యూయార్క్–ఢిల్లీ ,దుబాయ్–హైదరాబాద్ ,దోహా–ముంబై ,దోహా–ఢిల్లీ

బూడిద(volcanic ash) ప్రభావంపై వాతావరణ నిపుణుల ప్రకారం భారతదేశంలో AQI పెరగే అవకాశం తక్కువ ,SO₂ స్థాయిలు నేపాల్, హిమాలయాలు, యుపి తేరాయి ప్రాంతాల్లో పెరిగే అవకాశం , కొంత బూడిద పర్వత ప్రాంతాలకు తాకి ఆపై చైనాకు చేరుతుంది

హైలీ గుబ్బి అగ్నిపర్వతం విస్ఫోటనం 14 కి.మీ ఎత్తుకు బూడిదను ఎగజిమ్మి, పరిసర గ్రామాలను బూడిదతో కప్పేసింది. నివాసితులు “బాంబ్ పేలినట్లుగా” శబ్దం వినిపించిందని, దానికి వచ్చిన షాక్‌వేవ్ భయపెట్టిందని వెల్లడించారు.

స్మిత్‌సోనియన్ గ్లోబల్ వోల్కానిజం ప్రోగ్రాం ప్రకారం, ఈ అగ్నిపర్వతం గత 12,000 సంవత్సరాలలో ఎలాంటి విస్ఫోటనం రికార్డు కాలేదు. ఇది చాలా అరుదైన భౌగోళిక సంఘటనగా పేర్కొంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media