Farooq Abdullahపై హత్యాయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. వివాహ వేడుకలో పాల్గొన్న సమయంలో కమల్ సింగ్ జమ్వాల్ అనే వ్యక్తి ఆయనపై కాల్పులకు ప్రయత్నించాడు.
అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఫరూక్ అబ్దుల్లాను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం నిందితుడు కమల్ సింగ్ జమ్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఘటన Jammu and Kashmirలో జరిగింది.
