ఫుట్ బాల్ ప్రపంచ కప్ చూడాలనుకుంటున్నారా?

June 11, 2026 11:33 PM
fifa world cup 2026 zee5

ఫిఫా వరల్డ్ కప్ 2026 మొదలైంది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ గురువారం ప్రారంభమై జూలై 19న ముగుస్తుంది. భారత అభిమానులు ఈ టోర్నమెంట్ ప్రసారాలను జీ ఎంటర్‌టైన్‌మెంట్ కు చెందిన చానళ్లలో, జీ5 ఓటీటీలో వీక్షించవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దూరదర్శన్ స్పోర్ట్స్ (డీడీ స్పోర్ట్స్) ఛానెల్‌లో కొన్ని కీలక మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనున్నారు. మొత్తం 104 మ్యాచ్‌లు జీ కొత్తగా ప్రారంభించిన యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కామెంటరీ అందుబాటులో ఉంటుంది. జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో టోర్నీ మొత్తం లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లను తీసుకోవాలి.

డీడీ ఫ్రీ డిష్‌తో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌లపై కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనుంది. వీటిలో నేటి అర్ధరాత్రి 12:30 గంటలకు భారత్‌లో ప్రసారమయ్యే ఆరంభ మ్యాచ్ (మెక్సికో vs సౌత్ ఆఫ్రికా), క్వార్టర్-ఫైనల్స్ (జూలై 9-11), సెమీ-ఫైనల్స్ (జూలై 14-15), ఫైనల్ (జూలై 19)ను చూడొచ్చు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media