తెలంగాణలో Finland విద్యా విధానం…?

April 23, 2026 12:08 PM

ప్రపంచంలో అత్యుత్తమ విద్యా విధానాల్లో ఒకటిగా పేరుగాంచిన Finland మోడల్‌ను అధ్యయనం చేయడానికి తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఇటీవల పర్యటించారు. అక్కడి విధానాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ఫిన్లాండ్‌లో సుమారు 98% పాఠశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తుండటం ప్రత్యేకత. విద్యార్థులకు 9వ తరగతి వరకు ఎలాంటి అధికారిక పరీక్షలు ఉండవు. ర్యాంకులు, పోటీ లేకుండా ఒత్తిడి లేని విద్య అందిస్తారు. ప్రతి 45 నిమిషాల క్లాస్ తర్వాత 15 నిమిషాల విరామం ఉండటం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది.టీచర్లకు మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి కాగా, ఒకే టీచర్ వరుసగా ఆరేళ్ల పాటు ఒకే విద్యార్థులకు బోధించడం ద్వారా వారి సామర్థ్యాన్ని బాగా అర్థం చేసుకుంటారు. ప్రాథమిక విద్య మొత్తం మాతృభాషలోనే బోధించడం మరో ముఖ్య లక్షణం.ఇంకా అక్కడ పిల్లలకు 7 ఏళ్ల వరకు చదవడం, రాయడం వంటి ఒత్తిడి ఉండదు. పాఠశాలల్లో ఉచిత మధ్యాహ్న భోజనం, వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media