విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద భయానక బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ‘విహారి ట్రావెల్స్’ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది.
బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని ఆపాడు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా, వారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు.
కొంతమందికి స్వల్ప గాయాలు అయినప్పటికీ, పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఇంజిన్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా, రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


