ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ కాన్యన్ గా పిలవబడే గండికోట చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గండికోట ఉత్సవాలు-2026’ నేటి (జనవరి 11) నుండి ప్రారంభం కానున్నాయి. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడిస్తూ, ప్రజలందరికీ సాదర ఆహ్వానం పలికారు.

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగాలు, గాయని మంగ్లీ మ్యూజికల్ నైట్, రామ్ మిర్యాల ప్రదర్శన, డ్రమ్స్ మాంత్రికుడు శివమణి మ్యూజికల్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పర్యాటకుల కోసం హెలిరైడ్, పారామోటార్ గ్లైడింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు.సౌండ్ & లైట్ షో, లేజర్ షో, స్కై లాంతర్ ఫెస్టివల్ మరియు 270 డిగ్రీల ఐమాక్స్ థియేటర్ అనుభూతిని అందించే ప్రదర్శనలు.గండికోట చరిత్రను వివరించేందుకు గైడెడ్ హెరిటేజ్ వాక్ మరియు కథా సదస్సులను నిర్వహిస్తున్నారు.కుటుంబ సమేతంగా తరలివచ్చి మన సంస్కృతిని, గండికోట అందాలను వీక్షించాలని కలెక్టర్ కోరారు.
