GHMC ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్–సిటీ (H-City) ప్రాజెక్ట్ పనులను అడిషనల్ కమిషనర్ జి. శ్రీజన (IAS) గురువారం స్వయంగా పర్యవేక్షించారు. జోనల్ కమిషనర్ హేమంత్ (IAS) మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఫ్లైఓవర్లు, రోడ్డు పనులను కాలినడకన పరిశీలించారు.

గుల్మోహర్ పార్క్ నుండి తారానగర్ ఫ్లైఓవర్ వరకు, అలాగే అమీన్పూర్ రోడ్ మరియు ఆల్విన్ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే సర్వీస్ రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హెచ్–సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఖాజాగూడ జంక్షన్లో నిర్మించనున్న ప్రతిపాదిత ఫ్లైఓవర్ మరియు అండర్‌పాస్ స్థలాన్ని పరిశీలించి, పనుల ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఈ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో డీసీ ప్రశాంతి, సీసీపీ వెంకన్న, సిటీ ప్లానర్ శ్యామ్ మరియు ఇతర ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.
