అమలాపురంలో GMC బాలయోగి 24వ వర్ధంతి

March 4, 2026 9:10 AM

కోనసీమ అభివృద్ధి ప్రదాత, భారత లోక్ సభ మాజీ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి 24వ వర్ధంతి వేడుకలు మంగళవారం అమలాపురంలో ఘనంగా జరిగాయి. నల్లవంతెన సమీపంలోని బాలయోగి ఘాట్ వద్ద ఆయన తనయుడు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి ప్రత్యేక పూజలు నిర్వహించి, నివాళులర్పించారు.

తన నివాసం నుండి ర్యాలీగా బయలుదేరిన ఎంపీ హరీష్, ఘాట్ వద్ద ఉన్న బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలయోగి సేవలను స్మరించుకున్నారు.వర్ధంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించారు.కోనసీమను అభివృద్ధి పథంలో నడిపించిన మహనీయుడిగా బాలయోగి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని నేతలు కొనియాడారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media