Gold Price: దుమ్ము రేపుతున్న బంగారం ధర.. తులం ఎంతంటే ??

October 2, 2025 3:28 PM

పోనీ పండగ తర్వాత ఏమైనా తగ్గుతాయా అంటే అస్సలు అలాంటి సీన్ లేదని బులియన్ అనలిస్టులు అంటున్నారు. అక్టోబర్ 1, బుధవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,20,730 రూపాయిలుగా ఉంది. 22 కేరట్ల బంగారం ధర తులం రూ.1,11,800 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,49,200 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల తులం పసిడి ధర రూ.1,17,600, 22 కేరట్ల ధర రూ. 1,07,810గా ఉంది. ముంబైలో 24 కేరట్ల తులం పసిడి ధర రూ. 1,17,450గా, 22 కేరట్ల ధర రూ.1,07,660గానూ ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1, 17, 450గా ఉండగా.. 22 కేరట్ల ధర రూ.1, 07, 660 గా ఉంది. బెంగళూరులో 24 కేరట్ల ధర రూ.1,17,450, 22 కేరట్ల ధర రూ.1,07,660 గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల ధర రూ.1,17,450, 22 కేరట్ల ధర రూ.1,07,660 గా ఉంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు బంగారం చేరుతోంది. తులం బంగారం లక్షన్నర వైపు పరుగులు తీస్తోంది. అదే జరిగితే ఇక సామాన్యులు బంగారం గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే. వెండి ధర కూడా భారీగానే పెరుగుతోంది. దీపావళి నాటికి ఈ పసిడి ధర మరింత భగ్గుమనటం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media