డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె, టీడీపీ నేత గొల్లపల్లి అమూల్య తన భర్త దొమ్మేటి సునీల్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. అదనపు కట్నం కోసం తనను శారీరక, మానసికంగా వేధించాడని, ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని ఆమె రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన మహిళల హక్కులు, భద్రతపై చర్చను మళ్లీ ముందుకు తెచ్చింది.
తండ్రి వైసీపీ నేత కాగా, కుమార్తె టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న నేపథ్యంలో రాజకీయ కోణంలో కూడా ఈ కేసు చర్చనీయాంశమైంది.
Gollapalli amulya: వరకట్న వేధింపులపై గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు
