అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ అమెరికా న్యాయ విభాగం ఉపసంహరించుకుంది. ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్థారించారు. న్యూయార్క్లో హై- ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసు పూర్తిగా ముగిసిందని అమెరికా స్పష్టం చేసింది. ఇప్పటికే సివిల్ కేసులను యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఉపసంహరించుకుంది. ఇక ఇరాన్ ఎల్పీజీ దిగుమతులపై ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించిన కేసును అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ తో పరిష్కరించుకున్నట్లు అదానీ గ్రూపు తెలిపింది. కేసు పరిష్కారం కోసం 275 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అదానీ ఎంటర్ప్రైజెస్ అంగీకరించింది.
