Rapurలోని Good Shepherd English Medium Schoolలో వార్షికోత్సవ వేడుకలు మరియు అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యా, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి సర్టిఫికెట్లు, అవార్డులు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం ఈ జెమ్స్ మహోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.అదేవిధంగా, యూకేజీ పూర్తి చేసిన చిన్నారులకు, ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రత్యేకంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ వేడుక విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
