Middle Eastలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో సముద్ర రవాణా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. Gulf of Oman మరియు గల్ఫ్ ప్రాంతాల్లో 1,000కి పైగా కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు జీపీఎస్ సమస్యలతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

United States–Israel దాడులు ప్రారంభమైన తర్వాత ఉపగ్రహ నావిగేషన్ సిగ్నల్స్ జామ్ కావడంతో నౌకలు తమ ఖచ్చితమైన స్థానం గుర్తించలేకపోతున్నాయని నిపుణులు తెలిపారు.ప్రస్తుతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS) పనితీరులో అంతరాయం ఏర్పడటంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణాపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు వెల్లడించారు.
