GRAM PANCHAYATI ELECTIONS సన్నద్ధం: COLLECTOR ఇలా త్రిపాఠి

December 9, 2025 11:15 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో, లోపాలు లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు.

పోలింగ్ సామాగ్రి (బ్యాలెట్ పత్రాలు, బాక్సులు) పంపిణీ ఆలస్యం లేకుండా నిర్వహించాలి. పంపిణీ, స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. రిసీవింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్సుల స్వీకరణ సమయంలో ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా పటిష్ట నియంత్రణ చర్యలు తప్పనిసరి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిరంతరం ఉండాలి. క్యూలైన్ వ్యవస్థను అమలు చేయాలి. సీసీ కెమెరాల ద్వారా కార్యకలాపాలు పర్యవేక్షించాలి. తాగునీరు, విశ్రాంతి గదులు, పారిశుద్ధ్య వసతులు, వైద్య సౌకర్యాలు, ర్యాంపులు మరియు లైటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి.”సమన్వయం, శీఘ్ర స్పందన, పారదర్శకత – ఇవే ఎన్నికలకు విజయవంతమైన మూలాధారాలు.”ఈ తనిఖీలో జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డీపీఆర్‌ఓ వెంకటయ్య, ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సమన్వయంతో పనిచేయాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో, లోపాలు లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ కేంద్రాన్ని తనిఖీ చేసి, ఏర్పాట్లను పరిశీలించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media