హైకోర్టు స్టే ఆదేశాలు మొవ్వలో స్మశాన భూమి ఆక్రమణలపై చర్యలు

April 23, 2026 3:16 PM

హైకోర్టు ఆదేశాలతో కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో స్మశాన భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. స్మశాన వాటికగా కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించరాదని హైకోర్టు స్పష్టం చేస్తూ స్టే ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ, పోలీస్ శాఖలు అప్రమత్తమయ్యాయి.

సర్వే నం. 245లో నమోదైన సుమారు 5.18 సెంట్ల స్మశాన భూమిలో అక్రమంగా హాస్టల్ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసును విచారించిన హైకోర్టు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది.హైకోర్టు ఆదేశాల అమలులో భాగంగా అధికారులు నిర్మాణ పనులను నిలిపివేసి, స్మశాన అవసరాలకు తప్ప ఇతర నిర్మాణాలు నిషేధమని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. స్మశాన భూములను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, అక్రమ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media