రూ.92 వేల కోట్ల వ్యూహాత్మక అభివృద్ధి ప్రాజెక్టు
Great Nicobar: భారతదేశ రక్షణ మరియు సైనిక ఆధిపత్యానికి అత్యంత వ్యూహాత్మకమైన ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. ఇక్కడి ‘గ్రేట్ నికోబార్ ఐలాండ్’ లో కేంద్ర ప్రభుత్వం రూ. 92,000 కోట్ల భారీ వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టింది.
హిందూ మహాసముద్రంలో చైనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించడం మరియు అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ టెర్మినల్ ద్వారా భారత నౌకాదళాన్ని పటిష్టం చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. చైనాకు అవసరమైన దాదాపు 80 శాతం ఇంధన సరఫరా ఈ సముద్ర మార్గం నుంచే జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ చైనా పాలిట సింహస్వప్నంగా మారింది.
పర్యావరణం, గిరిజన హక్కులపై అభ్యంతరాలు: Great Nicobar
చైనా నేరుగా భారతదేశాన్ని డిమాండ్ చేయలేక ప్రతిపక్షాల ద్వారా ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ఒత్తిడి తెచ్చింది. అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లి ప్రతిపక్ష నేతలు పర్యావరణం పేరుతో అక్కడి గిరిజనులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
విదేశీ నిధులు తీసుకునే ఆక్టివిస్టుల సాయంతో కోర్టులను ఆశ్రయించి ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టును ఆలస్యం చేశారు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల వారి వాదనలన్నింటినీ తిరస్కరించి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది.
అభివృద్ధి వర్సెస్ పర్యావరణ పరిరక్షణపై చర్చ:
గతంలో గుజరాత్‌లో నర్మదా నది ప్రాజెక్టును కూడా లెఫ్ట్ అనుకూల ఆక్టివిస్టులు ఇలాగే అడ్డుకున్నారు. ప్రజలు నీరు లేక అల్లాడుతున్నా ప్రాజెక్టును రానివ్వబోమని మొండికేసారు. కానీ గుజరాత్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఇంటికీ నీరు అందించారు.
కూడంకుళం, విజింజం, స్టెరిలైట్ ప్రాజెక్టులను కూడా నాశనం చేయడానికి ఈ గ్యాంగ్ ప్రయత్నించింది. ఇప్పుడు Great Nicobar ప్రాజెక్టు ను అడ్డుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ధ్రుఢమైన వైఖరితో ముందుకే సాగుతోంది.



