చింతపల్లి ముత్యాలమ్మ ఆలయంలో మాజీ మంత్రి అమర్నాథ్

April 16, 2026 11:07 AM

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని మన్య ప్రాంత ప్రజల సుఖశాంతి, రైతుల అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు తెలిపారు.ముత్యాలమ్మ జాతర భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ఈ ప్రాంతానికి అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media