కానిస్టేబుల్ సౌమ్యకు గూడూరులో ఘన నివాళి.. కన్నీటి వీడ్కోలు

February 3, 2026 6:08 PM

నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల గూడూరు ఎక్సైజ్ శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. గూడూరు ఎక్సైజ్ కార్యాలయంలో సీఐ బిక్షపతి ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు.

సౌమ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఐ బిక్షపతి, విధి నిర్వహణలో ఆమె చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గంజాయి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తూ ఆమె ప్రాణత్యాగం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.ప్రాణత్యాగం చేసిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని ఈ సందర్భంగా అధికారులు కోరారు. గంజాయి స్మగ్లింగ్‌ను నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ మరింత అప్రమత్తంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media