గుజరాత్‌ టైటాన్స్‌ బస్సులో పొగలు.. తృటిలో తప్పిన ప్రమాదం

June 1, 2026 10:32 AM

గుజరాత్‌: గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఫైనల్‌ మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి హోటల్‌కు బస్సులో వెళ్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా బస్సులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో ఆటగాళ్లు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది.

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాళ్లు అప్రమత్తమయ్యారు. బస్సు ఆపించి అందరూ కిందకు దిగారు. దీంతో క్రికెటర్లు, జట్టు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఘటన వల్ల కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. మరో బస్సు వచ్చే వరకు ఆటగాళ్లు, సిబ్బంది దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం ప్రత్యామ్నాయ బస్సులో హోటల్‌కు చేరుకున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media