Guntur జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో మృతిచెందిన బండారు పద్మ పిల్లలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లి మృతి తర్వాత అనాధలైన తాము, ప్రభుత్వం అందించే పరిహారం నేరుగా తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ తండ్రి మద్యానికి బానిసగా ఉండటంతో, అతని ఖాతాలో డబ్బులు జమ అయితే అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.చదువు కొనసాగించాలని ఆశపడుతున్నప్పటికీ, పనులకు పంపించి సంపాదించిన డబ్బును కూడా మద్యం కోసం ఖర్చు చేస్తున్నాడని వారు తెలిపారు.ఈ నేపథ్యంలో తమ చదువు, భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
