నల్లపాడులో 4 కిలోల గంజాయి స్వాధీనం ,నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలకలూరు రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ముప్పిరి సుబ్బారావు (38) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు నిందితుడికి సహకరించిన, గంజాయి వినియోగిస్తున్న మరో 7 గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ డీఎస్పీ బాణోదయ తెలిపారు.కూలి పనులు చేసుకునే సుబ్బారావు, ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో ఒరిస్సాలోని అల్సంధాపూర్ అనే చోట కిలో రూ. 2,000 చొప్పున గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. ఇతను వ్యక్తిగత వినియోగం కోసం కూడా గంజాయి తెచ్చుకునేవాడు.
అరెస్ట్ చేసిన 8 మందిలో 5 గురిపై హత్యాయత్నం, హత్య కేసులకు సంబంధించి ఇప్పటికే రౌడీ షీట్‌లు తెరవబడి ఉన్నాయి.
గంజాయి సరఫరా చేసే వారిపై నిఘా పెంచామని, గంజాయి విక్రయించినా, వాడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.
