ఆర్టీసీ బస్సుల్లో బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహిళల ముఠా గుంటూరు జిల్లా పొన్నూరు వద్ద పట్టుబడింది. పొన్నూరు రూరల్ పరిధిలో, ఆర్టీసీ బస్సులోప్రయాణికుల బంగారు ఆభరణాలు చోరీ చేయడానికి ఈ మహిళా ముఠా ప్రయత్నించింది.చోరీలకు పాల్పడుతున్న విధానాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై, ఆ నలుగురు మహిళలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పొన్నూరు రూరల్ పోలీసులు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న చోరీలకు అడ్డుకట్ట పడినట్లయింది.
