గురజాల నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులతో బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది. వాహనదారులు ముందస్తుగా ఇంధనం నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున బంకులకు తరలివస్తున్నారు.
దీంతో పెట్రోల్ బంకులు కిటకిటలాడుతూ, వాహనాల క్యూలు భారీగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి.అయితే, పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం ఎటువంటి కొరత లేదని, ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది.ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని సూచించారు.
