గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీలా శ్రీనివాసరావు తన పదవీకాలంలో నగర అభివృద్ధికి కీలకంగా పనిచేసినట్లు తెలిపారు. పాలకమండలి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన అచీవ్‌మెంట్స్‌ను వివరించారు.

తన హయాంలో సుమారు రూ.760 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు. నగర మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.జి-20, ఐఎఫ్‌ఆర్ వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. “గుడ్ మార్నింగ్” కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన పొందిందని చెప్పారు.బీచ్ రోడ్ నైట్ క్లీనింగ్, శుభ్రత కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడలేదని, నగరాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేశామని తెలిపారు.మంగళవారం అర్థరాత్రితో మేయర్‌తో పాటు పాలకమండలి పదవీకాలం ముగియనుండగా, తదుపరి ఎన్నికల వరకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పరిపాలన కొనసాగనుంది.
