GVMC ప్రత్యేక అధికారిగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నియామకం

March 10, 2026 4:32 PM

Greater Visakhapatnam Municipal Corporation (జీవీఎంసీ) ప్రత్యేక అధికారిగా Harendra Prasadను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి ఎన్నికలు జరిగే వరకు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈ అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు.ప్రత్యేక అధికారి నియామకంతో ఇప్పటివరకు ఉన్న మేయర్ అధికారాలకు బ్రేక్ పడనుంది. ఇకపై నగర పరిపాలన, అభివృద్ధి పనుల పర్యవేక్షణ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగిసిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కూడా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media