Telengana కలెక్టరేట్ లోనే ACB వల: విద్యాశాఖ వ్యవహారంలో అదనపు కలెక్టర్ అరెస్ట్

December 6, 2025 6:13 PM

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మరియు జిల్లా ఇన్‌ఛార్జి విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోనే రూ. 60,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ లంచం విద్యాశాఖ వ్యవహారానికి సంబంధించినదని సమాచారం. వెంకట్ రెడ్డితో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న మరో ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media