హన్మకొండ కడిపికొండలో అగ్నిప్రమాదం తండ్రీకూతుళ్లు మృతి

March 18, 2026 1:56 PM

హన్మకొండ సమీపంలోని కడిపికొండ రాజీవ్ గృహకల్పలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో తండ్రీకూతుళ్లు రాజశేఖర్, రాజశ్రీలు మృతి చెందడం స్థానికులను కలిచివేసింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై క్లూస్ టీమ్‌ను రప్పించి, మంటలు ఎలా వ్యాపించాయనే అంశంపై నమూనాలు సేకరించారు.ప్రమాద సమయంలో ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పొరుగువారు గుర్తించేలోపే మంటలు భారీగా వ్యాపించాయని సమాచారం.ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేదా గ్యాస్ లీకేజీ వల్ల జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media