మహిళల 55 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచిన హన్సికా
విశాల్ కలిరామన్, రాజత్ రుహాల్ కాంస్య పతకాలు.. భారత్ ఖాతాలో మొత్తం ఐదు మెడల్స్
హైదరాబాద్: బుడాపెస్ట్‌లో జరిగిన Polyák Imre, Varga János & Kozma István Memorial సీనియర్ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నీలో భారత మహిళా రెజ్లర్ Hansika Lamba మహిళల 55 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది.
అండర్-23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గతంలో రజత పతకం గెలిచిన హన్సికా మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది.
సెమీఫైనల్లో జర్మనీకి చెందిన అనస్తాసియా బ్లాయ్వాస్పై Hansika Lamba అద్భుత పోరాటం చేసింది. ఒక దశలో 2-7తో వెనుకబడిన ఆమె వరుస టేక్డౌన్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పి 10-7తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.
ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన నటాలియా క్లివ్చుట్స్కాతో పోటీపడింది. కఠిన పోరులో ఆమె 0-5 పాయింట్ల తేడాతో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.
ఇటీవల జరిగిన 2026 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం గెలిచిన హన్సికా, ఇప్పుడు బుడాపెస్ట్ టోర్నీలో రజతం సాధించి తన విజయాల జాబితాలో మరో ఘనతను చేర్చుకుంది.
పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో కూడా భారత రెజ్లర్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు. 65 కేజీల మూడో స్థానం పోరులో విశాల్ కలిరామన్ కజకిస్థాన్‌కు చెందిన ఒస్సుమ్జాన్ దస్తాన్బెక్పై 8-2 తేడాతో విజయం సాధించి కాంస్య పతకం గెలిచాడు.



