తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరో స్థానిక పార్టీ సంచలనం సృష్టించింది. నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి ఎన్నికల్లోనే అనూహ్యంగా 100కి పైగా స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది విజయ్ పార్టీ. ఇతర పార్టీల సహాయంతో ప్రభుత్వాన్ని ప్రారంభిస్తాడో లేక మెజారిటీ విజయ్ కు వరిస్తుందో ఇంకొద్ది గంటల్లో తేలిపోనుంది.
టీవీకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో విజయ్ నివాసం వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తొక్కిసలాటలు జరగకుండా విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
