గుంటూరు జిల్లా తెనాలిలో హిజ్రాల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన వ్యాపార సంస్థలు, గృహ ప్రవేశాలను టార్గెట్ చేస్తూ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ యజమానులను వేధిస్తున్నారు.
తెనాలిలో ఇటీవల ప్రారంభమైన ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్’ యజమానిని బెదిరించి హిజ్రాలు ఏకంగా రూ. 1,01,000 వసూలు చేశారు. అదే యజమాని తన కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం పెట్టుకోగా, అక్కడికి కూడా వెళ్ళిన హిజ్రాలు దౌర్జన్యం చేసి మరో రూ. 50,000 వసూలు చేశారు. హిజ్రాల వేధింపులు భరించలేక బాధితుడు తెనాలి మూడవ పట్టణ (Three Town) పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పట్టణ సీఐ (CI), తనదైన శైలిలో హిజ్రాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.వ్యాపారస్తులను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వసూళ్లకు పాల్పడితే రిమాండ్కు తరలిస్తామని పోలీసులు హెచ్చరించారు.
