ప్రో లీగ్‌లోకి మళ్లీ అర్హత.. జట్టుకు నగదు బహుమతులు ప్రకటించిన Hockey India
Sports: భారత మహిళల హాకీ జట్టు FIH Hockey Women’s Nations Cup New Zealand 2025-26 టోర్నమెంట్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఆక్లాండ్‌లో జరిగిన ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను 2-0 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
మ్యాచ్ ఆరంభంలోనే 4వ నిమిషంలో నవనీత్ కౌర్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యం అందించింది. అనంతరం 15వ నిమిషంలో సునేలిత టోప్పో దీపికా ప్రయత్నాన్ని అద్భుతంగా డిఫ్లెక్ట్ చేసి రెండో గోల్ నమోదు చేసింది.
ఈ విజయంతో వచ్చే సీజన్లో జరిగే FIH Hockey Women’s Pro Leagueలో భారత్ మళ్లీ ఆడే అర్హత సాధించింది. ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన లాల్రెంసియామికి Player of the Match అవార్డు దక్కింది.
మరోవైపు దీపికా టోర్నీలో మొత్తం ఆరు గోల్స్ చేసి అమెరికా క్రీడాకారిణి Ashley Sessaతో కలిసి సంయుక్త టాప్ స్కోరర్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పూల్-ఏ దశలో అమెరికాపై 3-2, జపాన్‌పై 2-1, ఉరుగ్వేపై 3-2 స్కోర్లతో గెలిచింది.
సెమీఫైనల్లో చిలీని 6-0 తేడాతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
మహిళల హాకీ జట్టు విజయానికి ప్రధాని మోదీ అభినందనలు :
జట్టు విజయాన్ని గుర్తిస్తూ Hockey India ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందిలో ప్రతి సభ్యుడికి రూ.1.5 లక్షలు నగదు బహుమతిగా ప్రకటించింది.
ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత మహిళల హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా పోస్టులో టోర్నీ మొత్తం జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచిందని ప్రశంసించారు.



