ఇంటింటికీ పింఛన్లు, నేతన్నలకు ఉచిత విద్యుత్ : మంత్రి అనిత

April 2, 2026 11:36 AM

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. నక్కపల్లిలో ఆమెకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం మంత్రి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తూ లబ్ధిదారులతో మమేకమయ్యారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీని ద్వారా నేతన్నల ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుందని మంత్రి తెలిపారు. నక్కపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఒక కార్మికురాలితో కలిసి మగ్గంపై నేసి, ఆమె వద్ద నుంచి చీర కొనుగోలు చేసి ప్రోత్సాహం అందించారు.తదుపరి అప్పల పాయకరావుపేటలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి, బోదుగల్లం సమీపంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media