వరంగల్ జిల్లా లో కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (వీసీ) డాక్టర్ నందకుమార్ రెడ్డి రాజీనామా, యూనివర్సిటీలో తనపై జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చారు.
కామినేని ఆసుపత్రికి చెందిన ఓ పీజీ విద్యార్థిని అర్జీ మేరకు తాను రీవాల్యుయేషన్ చేశానని, ఈ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.
యూనివర్సిటీ మరియు ప్రభుత్వం పరువు కాపాడాలనే మనస్థాపంతో మూడు రోజుల క్రితమే తన రాజీనామాను సమర్పించినట్లు తెలిపారు.
తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు.
తాను వీసీగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే తనపై దుష్ప్రచారం మొదలైందని, ‘ఆరు నెలల కంటే ఎక్కువ ఉండరు, కొత్త వీసీ వస్తారు’ అని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
సుపరిపాలన అందించిన రాముడి అంతటి వాడికే నిందలు తప్పలేదని, తాను మళ్లీ వీసీగా బాధ్యతలు చేపట్టినట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
