చైనా రాజధాని Beijingలో జరిగిన హాఫ్ మారథాన్‌లో హ్యూమనాయిడ్ రోబోలు ఆశ్చర్యకర ప్రదర్శన చేశాయి. 21 కిలోమీటర్ల ఈ రేసులో పలువురు రోబోలు మానవ రన్నర్లను మించి వేగంగా పరిగెత్తడం గమనార్హం.
ఈ ఈవెంట్లో Honor అభివృద్ధి చేసిన రోబోట్ 50 నిమిషాలు 26 సెకన్లలో ఫినిష్ చేసి ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన ఇచ్చింది. ఇది ఉగాండాకు చెందిన అథ్లెట్ Jacob Kiplimo రికార్డుకంటే కూడా వేగంగా ముగిసింది.గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీ పురోగతి కనిపించింది. 100కిపైగా టీమ్స్ పాల్గొనగా, దాదాపు సగం రోబోలు స్వయంచాలకంగా (Autonomous) రేస్ పూర్తి చేశాయి.నిపుణుల ప్రకారం, ఈ రోబోటిక్ అభివృద్ధి భవిష్యత్తులో తయారీ రంగం, ప్రమాదకర పనులు వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసే అవకాశముంది. అయితే ఇంకా వాణిజ్య వినియోగానికి పూర్తిగా సిద్ధం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు.చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుని భారీగా పెట్టుబడులు పెట్టుతోంది.
