హైదరాబాద్‌లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీ క్రైమ్ స్టేషన్ (CCS) స్పెషల్ క్రైమ్ టీమ్ మరియు గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఏప్రిల్ 23న అత్తాపూర్ సమీపంలోని ఎం.ఎం. పహాడీ ప్రాంతంలో నిఘా ఉంచి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 8 Honda Dio స్కూటర్లు, ఒక Hero Glamour బైక్, ఒక Bajaj Pulsar NS200 ఉన్నాయి.పోలీసుల దర్యాప్తులో నిందితులు Instagram వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు బయటపడింది. బాలానగర్, గాంధీనగర్, కొల్లూరు, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు.ఈ ఆపరేషన్‌ను డీసీపీ (క్రైమ్స్) ఎస్. చైతన్య కుమార్ మార్గదర్శకత్వంలో, ఏసీపీ జి. వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రావు బృందం విజయవంతంగా నిర్వహించింది.
