రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్ జోన్లలో ప్రత్యేక ఆంక్షలు
స్టార్ హోటళ్లు, నమోదిత క్లబ్‌ల బార్లకు మినహాయింపు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో (Liquor Outlets) మద్యం విక్రయాలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV Anand గురువారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాజేంద్రనగర్, గోల్కొండ జోన్లలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10 గంటల వరకు మూసివేయాలి.
అలాగే చార్మినార్ జోన్లో ఈ ఆంక్షలు ఆగస్టు 9 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయని కమిషనర్ వెల్లడించారు.
మహంకాళి బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అయితే స్టార్ హోటళ్లకు అనుబంధంగా ఉన్న బార్లు, నమోదిత క్లబ్‌లలోని బార్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.



