Mobile దొంగతనం ఛేదించిన శివకుమార్‌కు CP sajjanar సన్మానం

April 23, 2026 11:20 AM

Hyderabadలో ఓ సాధారణ పౌరుడు అసాధారణ ధైర్యం ప్రదర్శించి పోలీసుల ప్రశంసలు అందుకున్నారు. శివకుమార్ అనే వ్యక్తి తన సెల్‌ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత వెనక్కి తగ్గకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దొంగను ట్రాక్ చేశారు.

ఈ క్రమంలో ఆయన కేవలం తన ఫోన్‌ను మాత్రమే కాకుండా, మరికొన్ని 10 దొంగిలించిన మొబైల్ ఫోన్లను కూడా గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఒక చిన్న దొంగతనం కేసు పెద్ద నెట్‌వర్క్‌గా బయటపడింది.ఈ ఘటనపై స్పందించిన పోలీస్ కమిషనర్ శివకుమార్‌ను అభినందిస్తూ, ఆయన పట్టుదల, ధైర్యం సమాజానికి ఆదర్శమని తెలిపారు. ఒక వ్యక్తి చూపిన చొరవ ఎంతో పెద్ద మార్పుకు దారితీస్తుందని పేర్కొన్నారు. అనంతరం శివకుమార్‌ను సన్మానించి ప్రశంసా పత్రం అందజేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media